PRATHAPA RUDRAMA- Telugu Play 1st Part
PRATHAPA RUDRAMA THE FIRST EVER TELUGU PLAY WITH THREE PARTS PERFORMING AT RAVINDRA BHARATHI ON 28TH AND 29TH OF THIS SEPTEMBER.
Working Video clips
పోలవరపు హైమవతి గారు కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ ఆచార్యులుగా పనిచేశారు. సమగ్ర కాకతీయ చరిత్రపై ఎంతో అవగాహన ఉన్నవారు. మధ్యయుగంలో మూడు వందల సంవత్సరాలకు పైగా దేదీప్యమానమైన కాకతీయ చరిత్రను రాయదలచిన నేను ఆ మహా సామ్రాజ్య సమాచారం కోసం వీరిని ఆశ్రయించాను. కాకతీయత పట్ల ఎంతో ప్రేమాభిమానాలు గల వీరు ఆ మహా సామ్రాజ్య సమగ్ర చరిత్రని శాసనాథారితంగా, సవివరంగా అందించారు. ఆ సమాచారాన్ని నాటకాలుగా రాసాను. నా శ్రేయోభిలాషులు కోట్ల హనుమంతరావు దంపతులకు అంకితమిచ్చాను. చైత్ర బహుళ అష్టమినాడు రుద్రమ వారి పుట్టినరోజు సందర్భంగా రవీంద్రభారతిలో ఏప్రిల్ 8 వ తారీకు ఉదయం పూట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మరియు దాక్షిణాత్య ఆర్ట్స్అకాడమీ వారి సమర్పణలో, తెలుగునాట సర్వతోముఖమైన కళా వికాసానికి తూర్పు దిక్కై మొక్కవోని విశ్వాసంతో సర్వులలో స్ఫూర్తి నింపుతున్న మామిడి హరికృష్ణ వారి సమక్షంలో జరిగిన వేడుకలో.!
ఈనాడు... ఆ మూడు నాటకాల 'ప్రతాప - రుద్రమ' లో ప్రధమ భాగ నాటక ప్రదర్శన ఈనెల 28, 29 తేదీలలో రవీంద్రభారతిలో జరుగనుంది.
ఈ శుభ సందర్భంగా సమగ్ర చరిత్రను నాకు విశదీకరించి, నా రచనకు ఊపిరులూదిన ఆ మహోన్నతురాలు హైమవతి గారికి పాదాభివందనాలతో కృతజ్ఞతలు అందిస్తున్నాను.
--------------ఎన్నెస్ .నారాయణ బాబు, రచయిత.
Comments
Post a Comment